Eagle : 7 రోజుల్లో చేయాలనుకుంటే 17 రోజులు పట్టింది.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthik Ghattamaneni Interview for Eagle Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘ఈగల్’ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ విశేషాలు విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
మీరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.. కానీ ఈగల్ ప్రమోషనల్ కంటెంట్ లో అంతా విద్వంసం కనిపిస్తుంది?
-ఈగల్ కాన్సెప్ట్ లోనే విధ్వంసం వుంది. ఈగల్ లార్జర్ దేన్ లైఫ్ ఎంటర్టైనర్. అతని విధ్వంసం సమాజం కోసమే. అదేమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో కథానాయకుడు పత్తి పండించే రైతులా ఉంటారు. అయితే అతను పోరాడుతున్న సమస్య అంతర్జాతీయంగా ఉండేది. మనకి కూడా రిలవెంట్ గా వుంటుంది. రాంబో, టెర్మినేటర్ లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తాం, అలాంటి ఒక సినిమా తీసుకురావాలనే ప్రయత్నం. ఈగల్ అద్భుతమైన యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ చేస్తారు.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
దర్శకుడిగా రెండో సినిమానే ఇంత పెద్ద యాక్షన్ చేయడం ఎలా అనిపించింది ?
-నాకు ముందు నుంచి యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం, అయితే కెరీర్ బిగినింగ్ లో కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు ఈగల్ తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది.
రవితేజకి ఈ కథ ఎప్పుడు చెప్పారు ?
-రవితేజతో ‘ధమాకా’ సినిమాకి కెమెరామాన్ గా పని చేస్తున్న సమయంలో ఈ కథ చెప్పా, ఆయన కథ విన్న వెంటనే ..”ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం” అన్నారు.
నచ్చిన పాత్ర చేశానని రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పడం ఎలా అనిపించింది ?
-రవితేజ బ్రిలియంట్ యాక్టరని అందరికీ తెలుసు. కానీ కొన్ని సార్లు కమర్షియల్ రీజన్స్ వలన ఒకే సినిమాలో కామెడీ డ్యాన్స్ యాక్షన్ ఇలా చాలా రకాలు చేయాల్సి వస్తుంది. ఈగల్ లో మాత్రం ఆయన ఒక క్యారెక్టర్ లానే కనిపిస్తారు. ఆ తేడా చూసే ప్రేక్షకులకు అర్ధమౌతుంది. ఇంటెన్స్ గా ఉంటూ కూల్ గా ఉండటం ఆయనలో డిఫరెంట్ క్వాలిటీ.
ట్రైలర్ లో కథ, కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ కూడా ఇవ్వలేదు కదా.. స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా ప్రయత్నించరా ?
-ఈ కథకు సెకండరీ కాస్ట్ చాలా ముఖ్యం. ఆ పాత్రల ద్వారా కథానాయకుడు ఎవరనే చెప్పే స్టైల్ ని ఎక్స్ ఫ్లోర్ చేశాం. విరుమాండి, రషోమన్, విక్రమ్ తరహా శైలి ప్రయత్నించాం. కాన్సెప్ట్ అంతా ముందే చెప్పేస్తే ఆ ఎక్సయిట్మెంట్ పోతుంది. సినిమా చూశాక మీరు ట్రైలర్ చూస్తే.. కాన్సెప్ట్ క్లియర్ గా ట్రైలర్ లో చెప్పామని అర్థమైపోతుంది.
రవితేజ నుంచి ఏ విషయాలు గ్రహించారు ?
-రవితేజ ఎనర్జీ లెవెల్స్ ఒక ఎత్తు.. అయితే ముఖ్యంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్ గా వుంటాయి. చాలా అందమైన జీవితం గడుపుతున్నారు, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ వున్న మనిషి.
ఈ సినిమాకి ఈగల్ అని పేరుపెట్టడానికి కారణం ?
-ఈగల్ నాలుగు కిలోమీటర్ల ఎత్తులో వున్నా కింద ఉన్న రాబిట్ ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ వుంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ఈగల్. హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా ఉంది. దీంతో ఈ కథలో హీరో పేరు ‘సహదేవ్ వర్మ’ టైటిల్ తో హిందీలో విడుదల చేస్తున్నాం .
డీవోపీ, దర్శకత్వం రెండిటిలో ఏది ఇష్టపడతారు ?
-నాకు స్టోరీ టెల్లింగ్ ఇష్టం, అయితే డీవోపీ యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. దాన్ని ఒక బ్లెస్సింగ్ గానే భావిస్తా.
నవదీప్ పాత్ర ఎలా ఉంటుంది ? అనుపమ, కావ్య పాత్రలు ఎలా ఉంటాయి ?
-నవదీప్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో ఆలోచల్ని కాంప్లిమెంట్ చేసే పాత్రలో నవదీప్ కనిపిస్తారు. నవదీప్ తన నటనతో సర్ ప్రైజ్ చేశారు, తనకు చాలా మంచి మెమరీ పవర్ వుంది. అలాగే అనుమప ఈ కథని ముందుకు నడిపించే పాత్రలో కనిపిస్తారు. కావ్య పాత్ర ఈ కథకు మరో కారణం. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా ఉంటుంది.
ఈగల్ లో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ?
-ఫిల్మ్ మేకింగ్ లో లోతుగా వెళ్లే కొలది సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. మనకు వున్న అనుభవంతో ఐదు రోజుల్లో ఓ సీక్వెన్స్ ని పూర్తి చేసేస్తామని అనుకుంటాం కానీ అనుకున్న సమయానికి ఫినిష్ కాదు. ఈగల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ని వారం రోజుల్లో తీసేయొచ్చు అనుకున్నా కానీ అది 17 రాత్రుళ్ళు పట్టింది. దాని కోసం అన్ని రియల్ ఎఫెక్ట్స్ ప్రయత్నించాం. ఈ క్రమంలో దాదాపు నాలుగు వందల మందిని ఇబ్బంది పెట్టా అయినా చాలా అద్భుతంగా వచ్చింది.
ఈగల్ సౌండింగ్ కొత్తగా అనిపిస్తుంది ? దాని గురించి ?
-ఈగల్ సౌండ్ డిజైన్ ఆరు నెలలు చేశాం. అన్ని రియల్ గా ప్రోడ్యుస్ చేశాం, యూరప్ లో రియల్ గన్స్ తో షూట్ చేసి ఆ సౌండ్ ని రికార్డ్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి థియేటర్ లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాండ్ పదేళ్ళుగా తెలుసు. తనతో మంచి జర్నీ వుంది.
మణి బాబు డైలాగ్స్ బాగున్నాయి ? ఆయన్ని తీసుకోవాలని ఆలోచన మీదేనా ?
-ఆయనతో నేను కార్తికేయ 2 చేశాను. అప్పటి నుంచి మా మధ్య అనుబంధం ఏర్పడింది. మాకు మంచి బ్యాలెన్స్ కుదిరింది. తన పద ప్రయోగం చాలా బాగుంటుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పని చేయడం ఎలా అనిపించింది ?
-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోం బ్యానర్ లా అయిపోయింది. సినిమాకు కావాల్సిన ప్రతిది ఒక్క ఫోన్ కాల్ తో సమకూర్చుతారు నిర్మాత విశ్వప్రసాద్.
దర్శకుడిగా మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ?
-తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తాం.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!