బాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ ఒకడు.. ఈ హ్యాండ్ సమ్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా అల వైకుంఠపురంలో రీమేక్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇక కార్తీక్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కార్తీక్ కోసం అమ్మాయిలు ఏకంగా రూ.20 కోట్లు ఇస్తాం .. పెళ్లి చేసుకో అంటూ వెంటపడిన విషయం విదితమే.. అలా వెంటపడడంలోనూ తప్పులేదంటున్నారు బాలీవుడ్ వర్గాలు.. మత్తెక్కించే కళ్లు.. అమ్మాయిలను ఆకర్షించే దేహం కార్తీక్ సొంతం.. అందుకేనేమో అమ్మాయిలందరూ కార్తీక్ వెంటపడుతున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కార్తీక్ నవ్వులు చిందిస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్స్ .. ఇలా అయితే ప్రపంచంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు కాలేవు అంటూ మిర్చిలో బ్రహ్మానందం డైలాగ్ చెప్పేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
Feeling Iconic !! #iconicgoldawards2022 pic.twitter.com/nOscrjasAx
— Kartik Aaryan (@TheAaryanKartik) March 12, 2022