Karthi To Look In 6 Different Getups In Sardar: హీరో కార్తి, ‘అభిమన్యుడు’ ఫేమ్ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. ‘సర్దార్’లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘సర్దార్’ టీజర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని, టీజర్‌లో కార్తి ఆరు విభిన్న గెటప్స్ కనిపించడంతో పాటు, బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ కారణంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని నిర్మాతలు తెలిపారు. పిఎస్ మిత్రన్ దర్శకత్వ ప్రతిభ మరోసారి ప్రేక్షకులను కనువిందు చేస్తుందని చెప్పారు. ఎదురుచూస్తున్నారు. ఈ యేడాది దీపావళి కానుకగా తెలుగు, తమిళంలో ‘సర్దార్’ థియేట్రికల్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు వర్షన్ ను విడుదల చేస్తుండటంతో సహజంగానే ఇక్కడా భారీ సంఖ్యలో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు.