ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్లోనే ఈ బిగ్ కాంబినేషన్ గురించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద హిట్ అయితేనే చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ షూటింగ్లో పూర్తి బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెలతో ముందుకు వెళ్తారా లేదా అనేది ‘ప్యారడైజ్’ ఫలితాన్ని బట్టి తేలనుంది. ఒకవేళ ప్యారడైజ్ గనుక ఆశించిన స్థాయి విజయ సాధించకపోతే ఈ కాంబినేషన్ విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి మైలురాయి లాంటి 100వ చిత్రంపై ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. గతంలో పూరీ జగన్నాథ్ చెప్పిన ఒక కథలో సెకండాఫ్ నచ్చకపోవడం వల్లే చిరంజీవి ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను ఎంచుకున్నారు. మరి ఇప్పుడు ‘కాకా’ తర్వాత చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ శ్రీకాంత్ ఓదెలతో ఉంటుందా లేదా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇక నాని నటించిన ప్యారడైజ్ భారీ అంచనాల మధ్య ఈనెల 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read
- Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
- Suriya - Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!