Kareena Kapoor South Industry Entry Confirmed with Yash: ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ బాలీవుడ్. కానీ ఇప్పుడు సీన్ మారింది. నార్త్ హీరోయిన్లు అది కుర్ర హీరోయిన్లా లేక ముదురు హీరోయిన్లా అనే తేడా లేకుండా అంతా ఇప్పుడు సౌత్ కి క్యూ కడుతున్నారు. తాజాగా ఇలాంటి జాక్ పాట్ నే కొట్టేసింది బాలీవుడ్ బెబోగా పేరున్న కరీనా కపూర్. ఆమె క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆఫర్ అందుకుందని పరోక్షంగా వెల్లడించింది. యాక్షన్, కామెడీ, లవ్ జోనర్స్ లో డిఫరెంట్ మూవీస్ చేసిన కరీనా కపూర్ హాట్ బ్యూటీగా దశాబ్దానికి పైగా హిందీ చిత్ర సీమలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పుడు 42 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రజెంట్ టబు, కృతి సనన్ తో స్క్రిన్ షేర్ చేసుకున్న కరీనా మార్చి 29న ది క్రూ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతోంది. దీని తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కరీనా ఎంట్రీ ఇవ్వబోతోంది.
Directors: హిట్ కోసం పరితపిస్తున్న డైరెక్టర్లు వీరే!
‘ది క్రూ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా కపూర్ త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేసింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఆ ప్రాజెక్టులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చింది. అయితే ముందు నుంచే యశ్ ‘టాక్సిక్’లో ఈ బ్యూటీ ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోండగా ఆ ప్రచారానికి ఇప్పుడు ఊతం ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే యష్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చి సైలెంట్ అయింది. తాజాగా కరీనా కపూర్ సౌత్ ప్రాజెక్ట్ పై హింట్ ఇవ్వడంతో కచ్చితంగా ఆమె ‘టాక్సిక్’లో నటించే హీరోయిన్ అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రీ పొడక్షన్ దశలో ఉన్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ ఆడియన్స్ ముందుకు రానుంది. మరి నిజంగా ఆమె కరీనా కపూర్ ఏనా? లేకపోతే కరీనా మరే సౌత్ సినిమాలో భాగం కానుంది? అనేది చర్చనీయాంశం అవుతోంది.