Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ప్రతి ఏడాది తమ కుటుంబంలో వివిధ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ జంట.. ఈసారి మాత్రం పర్యావరణహితమైన గణపతి విగ్రహంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్న ఫొటోలను కరీనా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అయితే ఆ మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసింది ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
కరీనా సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోల్లో సైఫ్ అలీ ఖాన్ తెల్లటి కుర్తా పైజామా ధరించి నేలపై కూర్చుని మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు కనిపించారు. ఎలాంటి హంగామా లేకుండా ఇంట్లోనే మట్టి విగ్రహాన్ని తయారు చేస్తూ సైఫ్ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాన్ని ఎంచుకోవడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి.
Also Read
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
- Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
అయితే ఆ తర్వాత కరీనా షేర్ చేసిన మరో ఫొటో అసలు ట్విస్ట్‌ను బయటపెట్టింది. చెక్క టేబుల్‌పై అందంగా తయారైన గణపతి విగ్రహాన్ని చూపిస్తూ.. ఆ విగ్రహాన్ని తన చిన్న కుమారుడు జెహ్ (జహంగీర్ అలీ ఖాన్) తయారు చేశాడని కరీనా వెల్లడించింది. కరీనా ఈ ఫొటోకు ‘మేడ్ బై మై జెహ్ బాబా’ అంటూ క్యాప్షన్ ఇస్తూ, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కరీనా, సైఫ్ కుటుంబం పండుగలను జరుపుకునే విధానం కూడా ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. కరీనా పంజాబీ కపూర్ కుటుంబానికి చెందినవారు కాగా, సైఫ్ ముస్లిం పటౌడీ కుటుంబం నుంచి వచ్చారు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ ఇద్దరు కుమారులు. తమ ఇంట్లో రెండు కుటుంబాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ వివిధ పండుగలను కలిసి జరుపుకోవడం వీరి కుటుంబంలో ఒక ప్రత్యేకతగా మారింది.
దీపావళి, క్రిస్మస్తో పాటు ఈద్ వంటి పండుగలను కూడా కరీనా, సైఫ్ తమ పిల్లలతో కలిసి జరుపుకుంటుంటారు. ఇప్పుడు గణేష్ చతుర్థి సందర్భంగా కూడా మట్టి గణపతిని తయారు చేయడం ద్వారా తమ ఇంట్లోని ఈ సంప్రదాయాలను మరోసారి చూపించారు. ముఖ్యంగా పిల్లలను కూడా ఈ వేడుకల్లో భాగం చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాయరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి ఆమె నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
- Tags
- cinema
- Saif Ali Khan
తాజావార్తలు
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!