యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alexander Zverev: యూఎస్ ఓపెన్ 2026లో జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (Alexander Zverev) అద్భుత విజయం సాధించాడు. ఫ్లషింగ్ మెడోస్‌లో బెన్ షెల్టన్‌పై హోరాహోరీ పోరులో గెలిచిన జ్వెరెవ్.. ఈ ఏడాది తన రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే విజయం అనంతరం అతడు చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అందరిని ఆకర్షించాయి.
చిన్న వయసులోనే ఎదురైన ఆరోగ్య సమస్యను అధిగమిస్తూ ప్రపంచ టెన్నిస్‌లో అగ్రస్థాయికి చేరుకున్న జ్వెరెవ్.. తన విజయాన్ని తల్లికి అంకితం చేశాడు. నాలుగేళ్ల వయసులో తనకు టైప్-1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు వైద్యులు తన భవిష్యత్తులో జీవితం, క్రీడలకు అనేక పరిమితులు ఉంటాయని చెప్పారని జ్వెరెవ్ గుర్తుచేసుకున్నాడు.
Also Read
మ్యాచ్ అనంతరం మాట్లాడిన జ్వెరెవ్.. తన టెన్నిస్ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి తన తల్లేనని చెప్పాడు. తన మ్యాచ్‌లను ఆమె సాధారణంగా ప్రత్యక్షంగా చూడకపోయినా, తాను ఈ స్థాయికి చేరుకోవడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నాడు. నాలుగేళ్ల కుమారుడికి డయాబెటిస్ ఉన్నట్లు వైద్యులు చెప్పిన సమయంలో ఒక తల్లి ఎంతో బలంగా నిలబడాల్సి ఉంటుందని జ్వెరెవ్ చెప్పాడు. తన తల్లి అప్పుడే “నా కొడుకు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్తాడు. టెన్నిస్ ఆటగాడు కావాలనుకుంటే టెన్నిస్ ఆటగాడే అవుతాడు. ఈ అనారోగ్యం మనల్ని నిర్వచించదు” అనే ధైర్యాన్ని తనకు ఇచ్చిందని గుర్తుచేసుకున్నాడు.
జ్వెరెవ్ చిన్నప్పటి నుంచే టైప్-1 డయాబెటిస్తో జీవిస్తున్నాడు. ఈ పరిస్థితిలో శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ జీవితాంతం నిర్వహణ అవసరం ఉంటుంది. తన అనారోగ్యాన్ని జ్వెరెవ్ చాలా సంవత్సరాల పాటు వ్యక్తిగతంగానే ఉంచుకున్నాడు. 2022లో తొలిసారి బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత తన పేరుతో ఉన్న ఫౌండేషన్ ద్వారా డయాబెటిస్తో జీవిస్తున్న చిన్నారుల్లో అవగాహన పెంచేందుకు, వారికి మద్దతు అందించేందుకు కృషి చేస్తున్నాడు.
మ్యాచ్‌ల సమయంలోనూ జ్వెరెవ్ తన గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తుంటాడు. అవసరమైనప్పుడు ఇన్సులిన్ పెన్ ద్వారా ఇన్సులిన్ తీసుకుంటాడు. గ్రాండ్‌స్లామ్ వంటి అత్యున్నత స్థాయి మ్యాచ్‌లలో ఒత్తిడి నడుమ కూడా మార్పుల సమయంలో ఇన్సులిన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతూనే డయాబెటిస్‌ను కూడా సమర్థంగా నిర్వహిస్తున్న జ్వెరెవ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. యూఎస్ ఓపెన్ టైటిల్ అనంతరం తల్లికి అతడు ఇచ్చిన ఈ భావోద్వేగ నివాళి అతని విజయానికి మరో ప్రత్యేకతను అందించింది.
26 sets. 22+ hours. And finally, this moment! 🙌#USOpen 2026 Champion, Alexander Zverev! 🫡 pic.twitter.com/pBkYA0Y7Sn
— Star Sports (@StarSportsIndia) September 14, 2026
తాజావార్తలు
-
Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. నలుగురు మృతి
-
Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
-
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!