Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balapur Ganesh 2026: రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ బాలాపూర్ గణేశుడి వద్ద వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా బాలాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బాలాపూర్ గణనాథుడి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం నుంచే నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయ నమూనా సెట్టింగ్ ప్రధాన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయాన్ని తలపించేలా నిర్మించిన ఈ భారీ సెట్టింగ్‌ను ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ నిర్మాణ వైభవం, విద్యుత్ వెలుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వాలంటీర్లను అందుబాటులో ఉంచడంతో పాటు, పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఉత్సవ సమితి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది.
మరోవైపు, ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. “తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఖైరతాబాద్ మహా గణపతిను కోరుకున్నాను. బడా గణపతిది 72 ఏళ్ల ప్రస్థానం. గవర్నర్ తొలి పూజ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేశాం. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశాం. గత మూడేళ్లుగా మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నాం. ఉత్సవాలు సక్రమంగా సాగాలంటే భక్తుల సహకారం కూడా ఎంతో అవసరం. ఆషాడ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాం. ఇప్పుడు గణపతిని కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని గణపతికి ప్రత్యేక పూజలు చేశాం. ఇప్పుడున్న విపత్తును ఎదుర్కొని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనీ కోరుకున్నాను.” అని మంత్రి స్పష్ట చేశారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!