బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాతగా ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నా దర్శకుడిగా సెంట్ పర్సెంట్ సక్సెస్ ఫుల్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేయాలన్నా హార్ట్ టచ్చింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్ కామెడీలు తీయాలన్నా ఆయనకు ఆయనే సాటి. కుచ్ కుచ్ హోతా హై నుండి దర్శకుడిగా మొదలైన ఆయన ప్రయాణం కభీ ఖుషీ కభీగమ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ వరకు సాగింది. కానీ 2023 నుండి మెగా ఫోన్‌కు దూరంగా ఉన్న కరణ్ నిర్మాతగా స్టార్ కిడ్స్‌ను స్టార్స్‌గా మార్చే పనిలో బిజీగా మారిపోయాడు. వాళ్లతోనే ఎక్కువగా సినిమాలు నిర్మిస్తూ చేతులు కాల్చుకున్నాడు.
Also Read : MSG : మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. ఇంతకీ ఎక్కడంటే?
2024లో వచ్చిన కిల్ తర్వాత నిర్మాతగా సరైన బ్లాక్ బస్టర్ చూడలేదు కరణ్ జోహార్. అదే ఏడాది తన ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్‌లో 50 శాతం వాటాను అమ్మేశాడు. 2025లోనైనా కోలుకుంటాడేమో అనుకుంటే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఏడాది వచ్చిన కేసరి చాప్టర్ 2 నుండి ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన లవ్ స్టోరీ తు మేరీ మే తేరా మే తేరా తూ మేరీ వరకు వరుస ఫ్లాప్స్ అతడ్ని, నిర్మాణ సంస్థను మరింత కుంగదీశాయి. దాంతో ఇక తానే రంగంలోకి దిగి త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్‌ను టచ్ చేయబోతున్నాడు. కరణ్ జోహార్ క్లాసిక్ మూవీల్లో ఒకటైన కభీ ఖుషీ కభీ గమ్ సీక్వెల్ ప్లాన్ చేయబోతున్నాడు. 2001లో అమితాబ్, షారూక్, హృతిక్ లాంటి మల్టీస్టారర్స్‌తో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 130 కోట్లను వసూలు చేసింది. ఓవరీస్‌లోనూ విపరీతంగా ఆడేసిన 25 ఏళ్ల కల్ట్ క్లాసిక్‌కు పార్ట్2 తీయాలనుకుంటున్నాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఇయర్ ఎండింగ్‌లోగా మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు బీటౌన్ ట్రేడ్స్ అంటున్నాయి.