MS Dhoni : క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ పేరుకు స్పెషల్ పేజీలు ఉన్నాయి. క్రికెట్ ప్రపంచంలో ధోనీకి ఇప్పటికీ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ధోనీ తరచూ ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉంటాడు. అంతే తప్ప ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రం కనిపించలేదు. ధోనీ సినిమాల్లో కనిపిస్తే చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా ధోనీ గురించి ఓ సాలీడ్ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ చేసిన పోస్టు సంచలనం రేపుతోంది. ఇందులో ధోనీ ఓ రొమాంటిక్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ రాసి ఉంది. వీడియో చివరలో ధోనీ హార్ట్ సింబల్ బెలూన్ పట్టుకుని కనిపిస్తున్నాడు.
Read Also : PBKS vs KKR: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఇది చూసిన వారంతా ధోనీ బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడేమో అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. అయితే ఈ పోస్టుకు గల్ఫ్ కు చెందిన ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో యాడ్ షూటింగ్ అని ప్రచారం జరుగుతోంది. ఆ యాడ్ ను కరణ్ డైరెక్ట్ చేస్తున్నాడేమో అని అంటున్నారు. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ధోనీ గనక సినిమాలో నటిస్తే మాత్రం కచ్చితంగా ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ ధోనీ ఈ వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఆయనకు క్రికెట్ లో క్లీన్ ఇమేజ్ ఉంది. కాబట్టి కొత్తగా ఆయన సినిమాల్లో సాధించేది ఉండకపోవచ్చు. కాబట్టి ఆ పోస్టు యాడ్ షూట్ అని తెలుస్తోంది.