Dilraju : టాలీవుడ్ బడా నిర్మాత అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు దిల్ రాజు. నిర్మాతల జాబితాలో దిల్ రాజుకు ఉన్నంత క్రేజ్ బహుషా ఎవరికీ లేదేమో. ఆయన సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అలాంటి దిల్ రాజు సడెన్ గా ఓ పోస్టు చేశారు. రేపు ఏప్రిల్ 16న బుధవారం ఉదయం 11.08గంటలకు దిల్ రాజు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు అంటూ ఆ పోస్టులో ప్రకటించారు. దీంతో అసలు ఏం ప్రకటించబోతున్నారు అని ఆరా తీస్తున్నారు. దిల్ రాజు నుంచి బిగ్ అనౌన్స్ మెంట్అంటే కచ్చితంగా పెద్ద సినిమా ఏదో ఉందేమో అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. అయితే దిల్ రాజు ఏదైనా సినిమా ఉంటే కచ్చితంగా హీరోలతో కలిసి అనౌన్స్ చేస్తారు.
Read Also : Jr NTR: ఏంటి.. ఎన్టీఆర్ చొక్కా కాస్ట్ అన్ని వేలా?
కానీ దిల్ రాజు రేపు అనౌన్స్ చేయబోయేది ఓ ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీ. టాలీవుడ్ సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే ఈ సంస్థతో దిల్ రాజు భారీ ఒప్పందం చేసుకున్నారని సమాచారం. దానికి సంబంధించిన వివరాలు రేపు వెల్లడించబోతున్నారంట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త టాలీవుడ్ ను ఊపేస్తోంది. మొన్న సంక్రాంతికి రెండు సినిమాలు తీసుకొచ్చిన దిల్ రాజు.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్టు సమాచారం. మరి రేపు దిల్ రాజు ఏఐ కంపెనీతో ఒప్పందం గురించే ప్రకటిస్తారా లేదా వేరే ఇన్ఫర్మేషన్ ఉందా అనేది చూడాలి.