అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్టబొమ్మ’. మలయాళ సినిమా ‘కప్పేలా’కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య నిర్మించిన ‘బుట్టబొమ్మ’ సినిమా జనవరి 26న విడుదల కావాల్సింది కానీ వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రమోషన్ ని పీక్ స్టేజ్ ని తీసుకోని వెళ్తూ మేకర్స్ బుట్టబొమ్మ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ లో ఉన్న ఫీల్ ని అలానే మైంటైన్ చేస్తూ రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కూడా అదే ఫీల్ ని క్యారీ చేసింది. ఇందులో లీడ్ పెయిర్ మధ్య ఎమోషన్ వర్కౌట్ అయ్యింది.
అర్జున్ దాస్ స్టైలిష్ గా కనిపిస్తూనే యాంగ్రీ మోడ్ లో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ‘అనిక’కి బుట్టబొమ్మ మంచి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సూర్య వశిష్ఠ రగ్గడ్ గా కనిపిస్తూనే చాలా కూల్ గా ఉన్నాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ లోనే బాగుంది అంటే సినిమాలో ఇంకా ఆకట్టుకునే అవకాశం ఉంది. మొత్తానికి లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, అర్జున్ దాస్ స్క్రీన్ ప్రెజెన్స్, కథలోని కంటెంట్ బుట్టబొమ్మ సినిమాని ప్రేక్షకులని మెప్పించేలా చెయ్యగలదు. అయితే ఫిబ్రవరి 3న సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లు మైఖేల్ సినిమా పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంటే ఒక్క రోజు తర్వాత రిలీజ్ అయ్యే ‘బుట్టబొమ్మ’ సినిమా కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది.