Kapil Sharma: అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Sharma Talks About His Career Bad Days: ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న ప్రముఖ కమెడియన్లలో కపిల్ శర్మ ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన అతడు.. అనతికాలంలోనే ఎవరికీ అందనంత స్థానానికి ఎదిగాడు. తమ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్స్ అందరూ ఇతని షోకి క్యూ కడుతున్నారంటే, అతని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కపిల్ శర్మ.. ఒకప్పుడు గడ్డు పరిస్థితుల్ని కూడా ఎదుర్కున్నాడు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అతని కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. అప్పుడు ఒంటరితనాన్ని అనుభవించిన కపిల్.. ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడట! ఈ సంచలన విషయాన్ని తన జ్విగాటో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Same Gender Marriage: స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడం కుదరదు.. తేల్చిచెప్పిన కేంద్రం
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
కపిల్ శర్మ మాట్లాడుతూ.. ‘‘2017లో నేను చేసిన ఫిరంగి సినిమా సరిగ్గా ఆడలేదు. అదే సమయంలో నా స్నేహితుడు సునీల్ గ్రోవర్తోనూ గొడవ అవ్వడంతో అతడు దూరమయ్యాడు. అప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఒక సెలెబ్రిటీగా నేను కోట్లమందికి తెలుసు. కానీ, ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. కనీసం బీచ్ వద్ద కూర్చొని, సముద్రాన్ని చూస్తూ సాధారణ జీవితం గడిపే పరిస్థితి కూడా లేదు. రెండు గదుల ఫ్లాట్‌లోనే ఉంటూ, బయట చీకటిని చూస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో వివరించలేను. ఆ టైంలో నేను ఆత్మహత్య గురించి ఆలోచించాను. నా కష్టసుఖాలను పంచుకునే వారు ఎవరూ లేరని అనుకున్నాను. ఈ దశను నేను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. చిన్నతనంలో కూడా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ.. ఎవరూ పట్టించుకోలేదు’’ అని చెప్పాడు.
Amit shah flight: అమిత్ షా వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైద్రాబాద్‌లోనే..
డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలేసి వచ్చినప్పుడు.. మనకు జాగ్రత్తలు చెప్పడానికి, పరిస్థితుల గురించి వివరించడానికి ఎవరూ ఉండరని కపిల్ తెలిపాడు. ఆ టైంలో ఒంటరిగా అయిపోయినట్టు ఉంటుందని.. అలాంటి దశను దాటిన తర్వాతే మీ చుట్టూ జరుగుతన్న విషయాలను గమనించడం ప్రారంభిస్తారని అన్నాడు. ఒక కళాకారుడు సెన్సిటివ్‌గా ఉన్నాడంటే.. దానర్థం అతడు తెలివి తక్కువవాడు కాదని వివరించాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాకే.. బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని తనకు అర్థమైందని కపిల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!