INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc Mega Rally: నవంబర్ 1 ఆదివారం.. విపక్ష కూటమికి చాలా కీలకమైన రోజు సిద్ధాంతాలతో సంబంధం లేకుండా.. ఇండియా కూటమి మొత్తం సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న రోజు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ రామ్ లీలా మైదానానికి 10 లక్షల మందిని తరలించాలని ఇండి బ్లాక్ కంకణం కట్టుకుంది. జంతర్ మంతర్ 2.0 విషయంలో ఫెయిల్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రతిపక్షాల నిరసనకు మద్దతు ప్రకటించింది. దీంతో ఇప్పుడు అందరి చూపులు నవంబర్ 1 వైపుకే మళ్లాయి ఇంతకీ ఆ రోజు ఢిల్లీలో ఏం జరగబోతోంది.
ఢిల్లీలోని రాంలీలా మైదానం నవంబర్ 1న జరగనున్న విపక్షాల మహా ర్యాలీకి సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న విపక్ష కూటమి ఈసారి భారీ బల ప్రదర్శనకు సిద్ధమైంది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న అన్ని పార్టీలు తమ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా భారీగా జన సమీకరణ చేస్తున్నాయి. ఈ ర్యాలీలో పది లక్షల మంది దాకా పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, నేహాబోరాతో పాటు సీజేపీ కీలక నేతలు ర్యాలీని ముందుండి లీడ్ చేసే అవకాశముంది.
Also Read
జంతర్ మంతర్‌ను డీ నోటిఫై చేసి నిన్న మొన్నటి వరకు ఆందోళలను కట్టడి చేయగలిగిన ఢిల్లీ పోలీసులకు అన్ని అనుమతులతో జరుగుతున్న రామ్ లీలా మైదాన్ సభకు భద్రతా ఏర్పాట్లు చేయడం మినహా మరో ఆప్షన్ లేదు. లక్షలాది మంది వస్తారని నిర్వాహకులు చెబుతుండటంతో ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు. రాంలీలా మైదానం చుట్టుపక్కల ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేదిక లోపల, బయట దాదాపు 3 వేల మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నారు. వీరికి అదనంగా 10 వేల మంది పారామిలటరీ బలగాలను కూడా రంగంలోకి దించారు. మైదానం మొత్తాన్ని పర్యవేక్షించడానికి 150 హై-డెఫినిషన్, ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి బాడీ-వోర్న్ కెమెరాలు కూడా అందుబాటులో ఉంచారు.
దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదానాన్ని భద్రత కోసం 8 రీజియన్లు, 14 జోన్లుగా విభజించారు. వీవీఐపీలు.. సీనియర్ అధికారుల వాహనాల రాకపోకల కోసం ప్రత్యేకంగా రెండు గేట్లు కేటాయించారు. రాహుల్ గాంధీ లాంటి అగ్ర నేతలను అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా తరలించేందుకు కంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేశారు. సాధారణ ఆందోళనకారులు లోపలికి వచ్చేందుకు మూడు గేట్లు ఏర్పాటు చేశారు. మైదానంలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్లతో.. బ్యాగేజ్ స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
ర్యాలీకి వచ్చే వారు జంతర్ మంతర్‌తో పాటు ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూలైలో విద్యార్థుల ఆందోళనల కారణంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి రావడంతో జంతర్ మంతర్ వద్ద నిరసనలను నిషేధించారు. ఆందోళనకారులు ఆంక్షలు ఉన్న ప్రాంతాల వైపు వెళ్లకుండా రోడ్లన్నీ బారికేడ్లతో మూసేశారు. నిరసనకారులు దేశంలోని ఏ ప్రాంతం నుంచి ఢిల్లీలో అడుగుపెట్టినా… వాళ్ల దారులన్నీ రామ్ లీలా మైదానానికి మాత్రమే వెళ్లేలా పోలీసులు ప్లాన్ చేశారు.
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!