కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టింది. కన్నడ తో పోటీగా తెలుగు స్టేట్స్, బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధిస్తోంది.
మూడవ రోజు అనగా శనివారం వరల్డ్ వైడ్ గా చూస్తే రూ. 81 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కర్ణాటక : రూ. 16.57 కోట్లు
హిందీ : రూ. 21.62 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 11.88 కోట్లు
తమిళ్ : 5.65 కోట్లు
మలయాళం : రూ. 4.50 కోట్లు
వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్స్ చూస్తే రూ. 231 కోట్లు కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్ లోను నిన్నటికి 2 మిలియన్ మార్క్ అందుకుని దోసుకెళ్తోంది కాంతార చాఫ్టర్ 1. ఇక ఈ రోజు ఆదివారం పబ్లిక్ హాలీడే కావడంతో చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ షోస్ తో స్టార్ట్ అయింది. ఈ రోజు భారీ నెంబర్ వచ్చే అవకాశం ఉంది.