ప్రజంట్ బాషతో సంబంధం లేకుండా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కానీ ఈ భారీ వసూళ్ల వెనుక టికెట్ రేట్ల పెంపే కీలక పాత్ర పోషించిందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు రూ.250 మించకూడదని ఓ కొత్త జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. నిర్మాతలు దీనికి తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి వారు కోర్టును ఆశ్రయించగా, కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. అదే సమయంలో ‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదల కావడం మేకర్స్‌కి అదృష్టంగా మారింది.
Also Read : Puri Jagannadh: చార్మితో రిలేషన్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పూరి
అయితే ఈ స్టే వల్ల టికెట్ ధరలపై ఎలాంటి పరిమితులు లేకుండా రూ.500 నుంచి రూ.2000 వరకూ వసూలు చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని మేకర్స్ పూర్తిగా వినియోగించుకున్నారు. ఫలితంగా సినిమా మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. కర్ణాటకలో ఒక్క రాష్ట్రంలోనే దాదాపు రూ.165 కోట్ల వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. వాస్తవానికి టికెట్ రేట్లు పెరగకపోతే ఈ సినిమా వసూళ్లు రూ.100 కోట్ల వద్దే ఆగిపోయేవని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, లాంగ్ రన్‌లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
కర్ణాటకలో మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో మొదటి వారంలోనే మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. దీపావళి సీజన్ కూడా దగ్గర్లో ఉండటంతో మరికొన్ని వారాల పాటు ఈ సినిమా వసూళ్లు బలంగా కొనసాగుతాయని అంచనా. మొత్తానికి కోర్టు తీర్పు వల్ల లభించిన టికెట్ రేట్ల పెంపు కాంతార టీమ్‌కి భాగా కలిసోచ్చిందని చెప్పాలి.