కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ అకా ‘శివన్న’ 125వ సినిమాగా ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన మూవీ ‘వేద’. డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ‘రా యాక్షన్’ మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటివలే శివన్న ఇంట్లో తెలుగు పోస్టర్ ని లాంచ్ చేసిన ప్రొడ్యూసర్స్… ఇప్పుడు వేద తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
Read Also: Sam: ఖుషి తర్వాత సమంతా తెలుగు సినిమా ఏంటి?
తెలుగు ఆడియన్స్ కోసం కొత్త ట్రైలర్ ని కట్ చెయ్యకుండా, ఆల్రెడీ మంచి ఇంపాక్ట్ ఫుల్ గా కట్ చేసిన కన్నడ ట్రైలర్ ఒరిజినల్ కట్ ని అలానే ఉంచి, డైలాగ్స్ ని తెలుగులో రాసి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. “నాకు భయం తెలియదు, క్షమించడం తెలియదు” అని శివన్న చెప్పిన ఆయన క్యారెక్టర్ ని తెలిసేలా చేసింది. అర్జున్ జన్య ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేద ట్రైలర్ ని గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో నిలబెట్టింది. త్వరలో వేద తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి, ఈ సినిమాని ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నారు. నాన్-హాలీడే రోజు వేద రిలీజ్ అవుతుడడంతో ఓపెనింగ్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Ghost: గ్యాంగ్ స్టర్ అవతారం ఎత్తిన ‘శివన్న’