Sam: ఖుషి తర్వాత సమంతా తెలుగు సినిమా ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ‘సమంతా’ ఒకరు. గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే వరకూ సమంతా కెరీర్ గ్రాఫ్ చాలా పెరిగింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంతా ‘ఫ్యామిలీ మాన్ 2’ వెబ్ సిరీస్ చేసి సూపర్ సక్సస్ కొట్టింది. ఇక్కడి నుంచి నార్త్ పైన ఎక్కువ దృష్టి పెట్టిన సామ్, తెలుగులో సినిమాలు చెయ్యడం తగ్గించేసింది. ఇదే సమయంలో సమంతా ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో సినిమాల నుంచి సమంతా పూర్తిగా దూరంగా ఉంది. దీంతో సమంతా తెలుగులో నటించట్లేదు, ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలని కూడా క్యాన్సిల్ చేస్తుంది, సామ్ ఇకపై తెలుగు తెరపై కనిపించదు, బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది లాంటి మాటలు ట్విట్టర్ లో ఎక్కువగా వినిపించడం మొదలయ్యాయి. వీటిని నిజం చేసేలా, ఇటివలే మళ్లీ సినిమా పనులు మొదలు పెట్టిన సమంతా ‘CITADEL’ షూటింగ్ కి వెళ్లిపోయింది కానీ ఆల్రెడీ కొంత పార్ట్ షూటింగ్ జరుపుకున్న ‘ఖుషి’ మూవీ సెట్స్ కి రాలేదు.
Read Also: Samantha: బ్యూటీ క్వీన్ ఈజ్ బ్యాక్… #CITADEL
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సమంతా డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోతుంది అందుకే ఖుషి మూవీ డిలే అవుతుంది అనే రూమర్ సోషల్ మీడియాలో ఉంది. రీసెంట్ గా దర్శకుడు శివ నిర్వాణ, ఖుషి షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందని చెప్పాడు కానీ ఆ త్వరలో ఎప్పుడు అనే ప్రశ్నకి సమాధానం “సమంతా డేట్స్ ఇచ్చినప్పుడు”. యశోద సినిమా కూడా ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ కాబట్టి దాన్ని పూర్తి చేసిన సమంతా, ‘CITADEL’ పూర్తి చేసిన తర్వాత ‘ఖుషి’ మూవీని కూడా కంప్లీట్ చేసేసి ఇక కంప్లీట్ గా నార్త్ కే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఈ ఆలోచనతోనే సమంతా ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చెయ్యలేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. సమంతా చేతిలో ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ‘శాకుంతలం’, షూటింగ్ కి వెళ్లాల్సిన ‘ఖుషి’, షూటింగ్ స్టార్ట్ అయిన ‘CITADEL’, అనౌన్స్మెంట్ కి రెడీగా ఉన్న మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ‘ఖుషి’ మూవీ మాత్రమే తెలుగు ప్రాజెక్ట్ ఇది తప్ప సమంతా మరో సినిమాకి ఓకే చెప్పిన రూమర్స్ కూడా ఎక్కడా వినిపించట్లేదు. సో దాదాపు సమంతా ఇకపై పాన్ ఇండియా సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తుందేమో కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించడానికి మాత్రం ఇప్పట్లో సిద్ధంగా ఉన్నట్లు లేదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు