కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ 2022ని ‘వేద’ సినిమా సక్సస్ తో హై నోట్ లో ఎండ్ చేశాడు. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘వేద’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది, ఇదే జోష్ ని 2023లో కూడా చూపించబోతున్నాడు ‘శివన్న’. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. ట్విట్టర్ ని షేక్ చేస్తున్న ఈ మోషన్ పోస్టర్ లో ‘ఘోస్ట్’ సినిమాకి సంబంధించిన కొన్ని గ్రాఫిక్స్ ని మేకర్స్ చూపించారు. కేవలం మోషన్ పోస్టర్ తోనే ‘ఘోస్ట్’ సినిమాపై అంచనాలని పెంచారు దర్శక నిర్మాతలు.
Read Also: Shiva Rajkumar: ‘పుష్ప’ జపం చేస్తున్న కన్నడ సూపర్ స్టార్
‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాని ‘బీర్బల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘శ్రినీ’ డైరెక్ట్ చేస్తున్నాడు. సందేశ్ నాగరాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. కన్నడనాట సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న శివరాజ్ కుమార్, తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడం ఇదే మొదటిసారి. ఇప్పటికే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కిచ్చా సుదీప్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలు బౌండరీలు దాటి కొత్త మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. మరి సూపర్ స్టార్ శివన్న కూడా ‘ఘోస్ట్’ సినిమాతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి న్యూ పాన్ ఇండియా హీరో అవుతాడేమో చూడాలి.
Make way for ya’ man #GHOST.
Presenting you the MotionPoster of #GHOST..
shooting in progress@lordmgsrinivas @ArjunJanyaMusic@SandeshPro@baraju_SuperHit pic.twitter.com/GGLr3Caxcg— DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2023
Read Also: Kantara: కాంతార ఓవర్ రేటెడ్ సినిమానా?