Vedha: ‘వేద’ గా రాబోతున్న కన్నడ సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vedha:కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నగా ఆయన సినిమాలు తెలుగులో కూడా రీలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ మధ్యనే భజరంగి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ రాజ్‌కుమార్. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం వేద. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది. శివన్నకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే .. ఈ చిత్రాన్ని అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్లో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో శివన్న సరసన ఘనవి లక్ష్మణ్ నటించింది. ఇక ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ తెలుగులో రిలీజ్ చేయనుంది. నేడు ఈ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ ను శివన్న తన ఇంట్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన కోరుతున్నట్లు తెలిపారు.
Premi Viswanath: అమ్మ.. వంటలక్క.. బాగా గట్టిగానే ప్లాన్ చేసావ్ గా..?
Also Read
ఇక నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ..”ఈ సినిమాను కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారు.ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామందిప్రయత్నాలు చేశారు. కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీ కి మన తెలుగులో కూడా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు.ఈ కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ ద్వారా త్వరలో మరిన్నీ గొప్ప సినిమాలను రిలీజ్ చేయబోతున్నాను” అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
-
OTR: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కొత్త లొల్లి..?
-
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్‌లో చర్చలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!