ప్రస్తుతం ఆడియెన్స్ సాధారణ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ ధోరణిలోనే ఓ కొత్త మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం ‘యముడు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉపశీర్షికతో రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రావణి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
Also Read:Sai Durga Tej : నీ త్యాగాలు నాకు తెలుసు బాబాయ్.. మనోజ్ పై సాయిదుర్గా తేజ్ పోస్ట్
తాజాగా ‘యముడు’ చిత్ర టీజర్‌ను గురువారం నాడు ప్రముఖ నటుడు నవీన్ చంద్ర ఆవిష్కరించారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ఈ టీజర్‌ను పరిశీలిస్తే, ఇది మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌ల మేళవింపుగా అనిపిస్తుంది. సిటీలో అమ్మాయిలు అదృశ్యమవుతున్న ఘటనలు, నాటకాల్లో యముడి వేషం వేసే ఒక వ్యక్తికి ఈ హత్యలతో సంబంధం ఉందేమో అన్నట్లుగా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. యముడు భూలోకానికి వచ్చి నరకంలో విధించే శిక్షలను ఇక్కడే అమలు చేస్తాడా అన్న ఊహను రేకెత్తిస్తుంది.
Also Read: JR NTR : విజేతలకు కంగ్రాట్స్.. గద్దర్ అవార్డుల ప్రకటనపై ఎన్టీఆర్..
‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథంతో రూపొందినట్లు సూచిస్తోంది. హిందూ ధర్మం నుంచి ఒక సరికొత్త ఆలోచనతో ఈ సినిమాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. టీజర్‌లో విష్ణు రెడ్డి వంగా సినిమాటోగ్రఫీ, భవాని రాకేష్ అందించిన నేపథ్య సంగీతం అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, అప్డేట్‌లను చిత్ర నిర్మాతలు వెల్లడించనున్నారు.