Kangana Ranaut: నిజమే.. బాలీవుడ్ మహేష్ ను భరించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తుందో ఎవరు ఊహించలేరు. బాలీవుడ్ మొత్తం ఒకవైపు ఉంటే .. కంగనా ఒక్కత్తే ఒకవైపు ఉంటుంది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న విషయం విదితమే. తనను బాలీవుడ్ భరించలేదు అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకొని బాలీవుడ్ మీడియా వాటిని కాంట్రవర్సీ చేసి డిబేట్ లు పెడుతున్న విషయం విదితమే. ఇక తాజాగా కంగనా ఈ వ్యాఖ్యలపై స్పందించింది. మహేష్ కు సపోర్ట్ గా నిలుస్తూ తనదైన రీతిలో బాలీవుడ్ మీడియాను ఏకిపారేసింది. ఆమె నటించిన ‘ధాకడ్’ మూవీ ట్రైలర్ రిలీజ్‌లో భాగంగా ఆమె ఈ విధంగా మాట్లాడింది.
“మహేష్ అన్నదాంట్లో తప్పేముంది.. అవును.. నిజమే మహేష్ ను బాలీవుడ్ భరించలేదు.. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరు.. పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కాబట్టి ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదు. ఆయన కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎన్నిసార్లు ప్రయత్నించారో నాకు తెలుసు .. అయినా మహేష్ అన్న మాటలను మీరెందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారో తెలియడం లేదు. మహేష్ కు టాలీవుడ్ పైన, ఆయన చేసే పనిపైన ఎంత గౌరవం, నిబద్దత ఉన్నాయో ఆయన మాటలు వింటుంటే అర్ధమవుతుంది. ఆయన అలా ఉన్నారు కాబట్టే ఈ స్థాయిలో ఉండగలిగారు. అది మనమందరం అంగీకరించాలి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ కంగనా చెప్పింది అక్షరాలా సత్యం అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Also Read
- Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
- Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
- Bloody Romeo : నాని 'బ్లడీరోమియో' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
-
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!