గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు ఎట్టకేలకు భారీ విజయం దక్కింది. ‘ఖైదీ’ చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ‘మాస్టర్’ చిత్రంతో కుర్రకారును సైతం మెప్పించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాను తెరకెక్కించాడు.. ఒక హీరో అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో లోకేష్ నిరూపించాడు. జూన్ 3 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి కమల్ కెరీర్ లోనే భారీ హిట్ గా విక్రమ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తమ విశ్వరూపాన్ని చూపించారు. కమల్ కు ధీటుగా వారి నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక సినిమాకు హైలైట్ ఎవరు అంటే స్టార్ హీరో సూర్య.. రోలెక్స్ పాత్రలో సూర్య నటన అభిమానులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది అని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా హిట్ తో కమల్ హీరోగా, నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ ఆనందాన్ని తన చిత్ర బృందంతో పంచుకున్నాడు. ఇప్పటికే కమల్, లోకేష్ కనగరాజ్ కు కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన విషయం విదితమే.. ఇక తాజాగా ఈ చిత్రంలో అతిధి పాత్రలో మెరిసిన సూర్యకు కూడా కమల్ భారీ బహుమతిని అందించాడు.. కోట్ల విలువ చేసే రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా అందించాడు. ఈ పాత్ర కోసం సూర్య ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదన్న విషయం విదితమే.. కమల్ కోసం ఈ పాత్ర కోసం ఒక్క రూపాయి కూడా నటించాడు సూర్య.. ఇక ఆ అభిమానాన్ని విక్రమ్ నిలబెట్టుకున్నాడు. తన కోసం ఇంత గొప్ప పని చేసిన సూర్యకు అరుదైన బహుమతిని ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు కమల్.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
A moment like this makes life beautiful! Thank you Anna for your #Rolex! @ikamalhaasan pic.twitter.com/uAfAM8bVkM
— Suriya Sivakumar (@Suriya_offl) June 8, 2022