Kamal Haasan : కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు వైజాగ్ తో తీరని అనుబంధం ఉంది. ఇక్కడకు 21 ఏళ్ల వయసు అప్పుడు వచ్చాను. అప్పుడు నా ముఖం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి టైమ్ లో నేను చేసిన మరో చరిత్ర నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అప్పటి నుంచే తెలుగు ప్రజలు నన్ను ఆదరించారు. అక్కడి నుంచి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాను.
Read Also : Security Drills: సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా? మళ్లీ ఎప్పుడంటే..!
వైజాగ్ నాకు సొంత ఇల్లు లాంటిది. ఇక్కడ నా సినిమాలను అద్భుతంగా ఆదరిస్తున్నారు. నేను బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పుడు కూడా నన్ను తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేశారు. మీ రుణం ఎన్నటికైనా తీర్చుకుంటాను. నేను తెలుగులో 15 సినిమాలు చేస్తే అందులో 13 హిట్ అయ్యాయి. ఆ ప్లాపులు ఇచ్చింది నేనే. ఆ లోటు తీర్చుకోవడానికే ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాతో వస్తున్నాం. ఇది అద్భుతమైన మూవీ. మణిరత్నంగారు చాలా బాగా తీశారు. శింబు ఇందులో మంచి పాత్ర పోషించాడు.
త్రిష పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. మంచి కథ ఎక్కడి నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే వారి మంచితనం. ఇప్పుడు థగ్ లైఫ్ తో మేం మంచి మూవీ చేశామని నమ్ముతున్నాం. ఇది మీ అందరికీ నచ్చుతుంది. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాను. ఈ మూవీని ఆయన స్టైల్ లో తీశారు. తెలుగు ప్రేక్షకులే మాకు అతిపెద్ద సపోర్ట్ గా దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అంటూ తెలిపారు కమల్ హాసన్.
Read Also : Sandeep Reddy : సందీప్ రెడ్డికి రామ్ చరణ్ దంపతుల స్పెషల్ సర్ ప్రైజ్..