ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ప్యాన్ వరల్డ్ మూవీగా మొదలైన ప్రాజెక్ట్ K ఇప్పుడు రోజురోజుకు అంచనాలు పెంచేసుకుంటోంది. నిజానికి ప్రాజెక్ట్ K మొదలైనప్పుడే అమితాబ్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ తో రేంజ్ ని పెంచుకున్న ఈ సినిమాలో కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగి పోయాయి. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ నెగెటివ్ రోల్ చేయబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉండగా ఇప్పుడు ఆ పాత్ర గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రాజెక్ట్ K లో ప్రభాస్ ని ఢీ కొట్టబోయే కమల్ హాసన్ రోల్ అత్యంత భయానకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అలాంటి వ్యక్తిని ఎలా అంతమొందించాలి అని ప్రభాస్ ఫై చేస్తాడని అంటున్నారు.
Niharika Konidela: ఎవడేమన్నా నాకు దాంతో సమానం.. నిహారిక వీడియో వైరల్
అదేమంటే ఈ ప్రపంచాన్నే తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే కోరికతో అత్యంత స్వార్ధ పరుడుగా, క్రూరుడిగా కమల్ కనిపిస్తారట. అసలు కలియుగం ఎలా అంతమవుతుంది, ఎవరి వల్ల అంతమవుతుంది అనేది ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నమాటే కాగా ఇప్పుడు అదే ఓ వ్యక్తి స్వార్ధానికి ప్రపంచం ఎలా అంతమవుతుంది అనేది నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K లో కమల్ పాత్ర ద్వారా చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక కమల్ హాసన్ పాత్ర లుక్ డిజైన్ ఎలా ఉంటుంది.. ఈపాత్రతో కమల్ క్రూరత్వాన్ని చూపించబోతున్నారు అనే విషయం ఇప్పటి దాకా క్లారిటీ లేదు కానీ అంచనాలు పెంచడం మాత్రం ఖాయం అని అంటున్నారు.