Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartik Aaryan: అస్సాంలో వరదల కారణంగా వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలోని సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం ఆయన అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించడంతో కార్తీక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 19 నుంచి అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. అనేక జిల్లాలు నీటమునిగిపోవడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు సహాయం అందించేందుకు కార్తీక్ ఆర్యన్ చేసిన విరాళం ఎంతో ఉపయోగపడనుంది.
అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక X ఖాతాలో చేసిన పోస్టులో, సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం అందించిన కార్తీక్ ఆర్యన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర సహాయక చర్యలకు ఆయన అందించిన ఈ సహకారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభినందించినట్లు పేర్కొంది. ఈ పోస్టును ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా తన ఖాతాలో రీషేర్ చేస్తూ కార్తీక్ ఆర్యన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అస్సాం ప్రజలకు అండగా నిలిచిన ఆయన ఉదారత నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు.
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
ప్రస్తుతం గోలాఘాట్, శివసాగర్, బిస్వనాథ్, చరాయిదేవ్, కామరూప్ మెట్రోపాలిటన్, జోర్హాట్, ధేమాజి, నాగావ్ జిల్లాలు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మొత్తం 21 రెవెన్యూ సర్కిళ్లు, 437 గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావంతో 2,12,400 మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో చరాయిదేవ్ జిల్లాలో దాదాపు 80 వేల మంది, శివసాగర్‌లో 71 వేల మంది, జోర్హాట్లో 40 వేల మంది ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తు సమయంలో కార్తీక్ ఆర్యన్ చేసిన ఈ భారీ విరాళం సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు అందుకుంటోంది. అభిమానులు ఆయన సామాజిక బాధ్యతను కొనియాడుతూ స్పందిస్తున్నారు.
- Tags
- cinema
- Kartik Aaryan
తాజావార్తలు
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!