భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా, ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నాయకుడు సినిమా. లోకనాయకుడు కమల్ హాసన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి చేసిన ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాయకుడు కథా కథనాలు ఎన్నో కమర్షియల్ సినిమాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. కమల్ హాసన్ అండ్ మణిరత్నంలకి ఇళయరాజా మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా తోడవ్వడంతో నాయకుడు మరింత గొప్ప మూవీ అయ్యింది. 1987లో రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత ఇద్దరు లెజెండ్స్ కమల్-మణిరత్నంలు కలిసి వర్క్ చేస్తే చూడాలని మూవీ లవర్స్ అంతా వెయిట్ చేసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తే కమల్ హాసన్-మణిరత్నంలు చేస్తున్న సినిమా థగ్ లైఫ్. కమల్ హాసన్ బర్త్ డే రోజున అనౌన్స్మెంట్ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది థగ్ లైఫ్ సినిమా.
జపనీస్ స్టైల్ లో డిఫరెంట్ మేకింగ్ తో కమల్-మణిరత్నంలు తమ మ్యాజిక్ ని చూపించారు. ఇన్నేళ్ల తర్వాత కలిస్తే ఈ రేంజులోనే ఉండాలి అని నిరూపించేలా థగ్ లైఫ్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేసారు. ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న కమల్-మణిరత్నం… ప్రీప్రొడక్షన్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకోని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు కలిసి జనవరి మూడో వారం నుంచి థగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు కమల్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తాడా లేక మధ్యలో బ్రేక్ తీసుకోని థగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికైతే ఇండియన్ 2 కంప్లీట్ అవ్వకముందే కమల్ థగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు అనే మాట కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.