భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా, ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నాయకుడు సినిమా. లోకనాయకుడు కమల్ హాసన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి చేసిన ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాయకుడు కథా కథనాలు ఎన్నో కమర్షియల్ సినిమాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. కమల్ హాసన్ అండ్ మణిరత్నంలకి ఇళయరాజా మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా తోడవ్వడంతో నాయకుడు మరింత గొప్ప మూవీ అయ్యింది. 1987లో రిలీజ్…