Kamakshi Bhaskarla: గతేడాది భారీ బ్లాక్ బ్లస్టర్స్ అందుకున్న సినిమాల్లో పొలిమేర 2 కూడా ఒకటి. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కరోనా సమయంలో పొలిమేర సినిమా ఓటిటీకి పరిమితమయ్యింది. చేతబడులు నేపథ్యంలో పొలిమేర ఉంటే.. దానికి గుడి రహస్యం జోడించి పొలిమేర 2 ను తెరకెక్కించారు. చిన్న సినిమాగా మొదలై.. భారీ అంచనాల నడుమ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పొలిమేరలో హీరోయిన్ కామాక్షికి అంత ప్రాధాన్యత లేకపోయినా.. సెకండ్ పార్ట్ లో ఆమెనే ప్రధాన పాత్ర. తప్పుచేసింది భర్త అయినా కూడా అతని చంపడానికి కూడా వెనుకాడని లచ్చిమి పాత్రలో కామాక్షి నటించింది అని చెప్పడం కన్నా జీవించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత కామాక్షికి మంచి గూటింపు రావడంతో పాటు వరుస అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కామాక్షి తాజాగా హాట్ లుక్ తో అభిమానులను షేక్ చేసింది. ట్రెడిషినల్ లుక్ లో కనిపించే ఈ చిన్నది ఒక్కసారిగా అందాల ఆరబోత చేస్తూ కనిపించింది. తాజాగా ఒక డిజైనర్ డ్రెస్ లో ఈ భామ.. ఎద అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఆరెంజ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తూ.. ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పొలిమేర లచ్చిమి.. ఇంత హాట్ గానా.. అస్సలు ఊహించలేదే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నది ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి.