ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ సలార్ డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ సినిమాతో పోటీ పడడానికి మిగతా సినిమాలేవి సాహసం చేయడం లేదు. షారుఖ్ ఖాన్ కూడా సలార్ మ్యానియాలో కొట్టుకుపోయేలా ఉన్నాడంటే… ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ సలార్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు డిసెంబర్ 21న డంకీ రిలీజ్ చేస్తున్నారు. నార్త్ సంగతి పక్కన పెడితే… సౌత్‌లో మాత్రం సలార్‌ను తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే… ఫ్లాప్ టాక్‌తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ప్రభాస్ సొంతం. అదే హిట్ టాక్ పడితే… సలార్ ర్యాంపేజ్‌ను తట్టుకోవడం కష్టమే. మూడు వారాల తర్వాత రానున్న సంక్రాంతి సినిమాలపై కూడా సలార్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ సలార్ సాలిడ్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే… మూడు, నాలుగు వారాలు బాక్సాఫీస్‌ను ప్రభాస్‌కు రాసివ్వాల్సిందే.
నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం సలార్ రిలీజ్ అయిన వారానికే థియేటర్లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘డెవిల్’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా డిసెంబర్ 29న ‘డెవిల్’ను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు కానీ సలార్ హిట్ అయితే… బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా సౌండ్ వినిపించదు. కాకపోతే సలార్ టాక్ తేడా కొడితే… డెవిల్ రిలీజ్ చేయొచ్చు కాబట్టి… సలార్ టాక్‌ను బట్టి డెవిల్ రిలీజ్ డేట్ లాక్ చేయాల్సి ఉంటుంది. కాదు కూడదు అంటే… సలార్ దండయాత్రను తట్టుకోవడం కష్టమే. అయితే సంక్రాంతి బరి నుంచి ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు తప్పుకున్నాయి కాబట్టి… అప్పటికి డెవిల్ రిలీజ్ చేస్తే బెటర్. మరి డెవిల్ డైనోసర్ ముందు రిస్క్ చేస్తాడా లేక సంక్రాంతికి షిఫ్ట్ అవుతాడా అనేది చూడాలి.