Deepika Padukone : దీపిక పదుకొణె గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూశాం. ఇప్పటికే దీపికను కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీమ్ దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్టులో దీపిక పదుకొణె శ్రీవిష్ణువు అవతారం అయిన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కల్కికి జన్మనిచ్చే సమయానికి దగ్గరగా ఉంది. అయితే ఇప్పుడు దీపిక పేరును ఎండ్ క్రెడిట్స్ నుంచి టీమ్ తొలగించినట్టు దీపిక ఫ్యాన్ పేజెస్ అప్పుడే ప్రచారం మొదలెట్టేశాయి . మొదటిపార్టు ఎండ్ క్రెడిట్స్ లో దీపిక పేరే ఉంది.
Read Also : Prabhas: ప్రభాస్ అంటే సీక్వెల్ పక్కా.. కానీ అయ్యే పనేనా?
ఇప్పుడు ఆమె పాత్ర కోసం వేరే వాళ్లను తీసుకుంటోంది మూవీ టీమ్. అందుకే దీపిక పేరు కాకుండా కొత్త వాళ్ల పేరును ఆ ఎండ్ క్రెడిట్స్ లో కూడా వేయాలని చూస్తున్నారంటూ ప్రచారం చేశారు.. ఈ విషయం నేషనల్ మీడియాలో హైలెట్ అయింది. మేం చెక్ చేసే ప్రయత్నం చేయగా.. అందులో దీపిక పేరు తొలగించలేదు. అమితాబ్ పేరు కిందే ఆమె పేరు ఉంది. ప్రస్తుతం కల్కి-2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపిక ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న వాళ్లకే ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. కానీ ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్కరి పేరు కూడా వినిపించలేదు. అనుష్క, రుక్మిణీ వసంత్, శ్రద్ధా కపూర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారనేది చూడాలి.
Read Also : Pawan-Kalyan : పవన్ కళ్యాణ్‌కి భారీ అడ్వాన్స్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్!
