Kalki 2898 AD underdog Promotions May become Plus to Movie: ఒక సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే.. సినిమా బడ్జెట్ అనుకున్నప్పుడే ప్రమోషన్స్‌కు ఇంత అని.. లెక్కలు వేసుకుంటారు నిర్మాతలు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాకు ప్రమోషన్స్ అంటే.. ఆ లెక్క కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ కల్కి విషయంలో మాత్రం అనుకున్నంత ప్రమోషన్స్ జరగడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. కల్కి అనే కాదు.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఒక్కోసారి నెగెటివ్ ట్రెండ్ చేయడం కూడా చూశాం. కాకపోతే సలార్ సినిమాకు మాత్రం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ వల్ల సాలిడ్ హైప్ వచ్చింది.
Lucky Baskhar : ‘ కోపాలు చాలండి శ్రీమతి గారు ‘ అంటున్న దుల్కర్ సల్మాన్..
చెప్పాలంటే.. మూవీ మేకర్స్ కంటే, ఫ్యాన్సే ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. ఇదే కాదు గత సినిమాలకు కూడా బాహుబలి క్రేజ్‌తో ఓవర్ హైప్ ఏర్పడింది. అదే ఫస్ట్ డే ఓపెనింగ్స్‌కు బాగా కలిసొచ్చింది. కానీ కల్కికి మాత్రం అలా జరగడం లేదనే మాట వినిపిస్తోంది. సినిమా బాగుంటే కలెక్షన్స్ పెరుగుతాయేమో గానీ, భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమని అంటున్నారు. సినిమా విడుదలకు వారం రోజులే ఉంది. ఈ టైంలో సోషల్ మీడియా కల్కి ఫీవర్‌తో తగలబడిపోవాల్సింది.. కానీ ఆ స్థాయి ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. అయితే.. ఓ విధంగా చెప్పాలంటే.. కల్కికి ఇదే చాలా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే.. ప్రభాస్ సినిమా అంటే, ఆటోమేటిక్‌గా భారీ హైప్ వస్తుంది. గతంలో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు ఇదే జరిగింది.
ఈ సినిమాల పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లకు వెళ్లారు. కానీ తీరా థియేటర్లకు వెళ్లాక తాము ఊహించిన స్థాయిలో సినిమా లేదని డిసప్పాయింట్ అయ్యారు. అందుకే.. ఇప్పుడు కల్కి పై ఓవర్ హైప్ లేకపోవడమే ఓ రకంగా బెటర్ అని చెప్పొచ్చు. మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడికి.. సినిమా అద్భుతంగా అనిపించిందంటే చాలు.. మౌత్ టాక్ వైరస్ కంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ప్రమోషన్స్ చేయకపోయిన సరే.. సాలిడ్ మౌత్ టాక్ పడితే వసూళ్ల వర్షం కురుస్తుంది. మేకర్స్ కూడా ఇదే స్ట్రాటెజీ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. పైగా కల్కి సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. కాబట్టి.. కల్కి సైలెంట్‌గా వస్తున్న సునామీ అనే చెప్పాలి.