Kalki-2 : కల్కి-2 నుంచి దీపికను గెంటేశారు. లెక్కలేనన్ని కండీషన్లు, అడిగినంత రెమ్యునరేషన్, బోలెడంత మంది అసిస్టెంట్లు అంటూ.. గొంతెమ్మ కోరికలు కోరేసరికి.. నీకో దండం అన్నాడు నాగ్ అశ్విన్. అయితే మొదటి పార్టులో దీపిక అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. కల్కి-2లో దీపికను తీసుకోవడానికి మెయిన్ రీజన్ బాలీవుడ్ లో ఈ సినిమాకు ఆమె ఎంతో కొంత క్రేజ్ తీసుకొస్తుందనే ఉద్దేశమే. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో రెండో పార్టులో ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకున్నా ఆ క్రేజ్ కు ఢోకా లేదు. అందుకే ఆమెను సైడ్ చేశారు. బాగానే ఉంది. మరి ఆమె ప్లేస్ లో ఎవరు సూట్ అవుతారు.. అంటే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Read Also : Manchu Lakshmi : ఇటు మిరాయ్.. అటు ఓజీ.. మంచు లక్ష్మీ రిస్క్..
అనుష్క, ప్రియాంక చోప్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ పక్కన అనుష్క సూట్ అయినట్టు ఇంకెవరూ సూట్ కాలేరు. పైగా ఇలాంటి బలమైన పాత్రలు పోషించడంలో అనుష్క దిట్ట. పైగా బాహుబలితో ప్రభాస్, అనుష్క జోడీకి పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి అనుష్కను తీసుకుంటే పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది. లేదు అనుకుంటే ప్రియాంక చోప్రా కూడా న్యాయం చేయగలదు. పైగా ప్రియాంకకు ఉన్న పాన్ వరల్డ్ క్రేజ్ బాగా యూజ్ అవుతుంది. ప్రియాంక కూడా ఇలాంటి బలమైన పాత్రలు పోషించడంలో దిట్ట. దీపికను మించి క్రేజ్ ఉన్న హీరోయిన్ ప్రియాంక. పైగా రాజమౌళి-మహేశ్ బాబు సినిమాలో నటిస్తోంది. కల్కి-2 సినిమా రాజమౌళి మూవీ తర్వాతనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పటికి ప్రియాంక క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అది కల్కి-2కు కలిసొస్తుందని ఆలోచిస్తున్నారంట. మరి ఎవరిని తీసుకుంటారో చూడాలి.
Read Also : Ilaiyaraaja : చుక్కలు చూపిస్తున్న ఇళయరాజా.. మరీ ఇంత అవసరమా..?