Ilaiyaraaja : సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ఉన్న పాటల ప్రసహనం మరెవరికీ ఉండదు. ఆయన పాటల్లో ఓ సముద్రాన్నే నిర్మించారు. ఎనలేని కీర్తి సంపాదించిన ఇళయరాజా.. తన మ్యూజిక్ విషయంలో అంతే పట్టుదలతో ఉంటారు. తన పాటల్లోని చిన్న బిట్టు వాడినా సరే కేసులు, పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు. ఇళయారాజ క్రియేట్ చేసిన పాటలు అన్ని రంగాల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక భాగం అయిపోయాయి. దాంతో ఏ సినిమా వాళ్లు తన సినిమాల్లోని రిఫరెన్సులు వాడినా సరే వెంటనే వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. రీసెంట్ గా తాలా అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీమీద ఇలాంటి కేసే వేశారు. దెబ్బకు ఓటీటీ నుంచి ఆ సినిమానే తీసేశారు.
Read Also : Mahesh Babu : ఆ సంచలన డైరెక్టర్ తో మహేశ్ బాబు మూవీ..?
గతంలో కూడా కొన్ని సినిమాలపై ఇలాంటి కేసులు వేస్తున్నారు రాజా. ఇది చూసిన చాలా మంది.. ఈ ఏజ్ లో ఇలాంటివి అవసరమా అంటున్నారు. సంగీతంతో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న ఆయనకు.. ఇలాంటి పనుల వల్ల చెడ్డపేరు వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. మ్యూజిక్ పరంగా వచ్చిన గుర్తింపును.. ఇలాంటి పనుల వల్ల హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లతో గొడవల వల్ల పోగొట్టుకోవడం ఎందుకు అని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలపై కేసులు వేసి.. అందరి దృష్టిలో నెగెటివ్ గా కనిపిస్తున్నారు. కాబట్టి ఇళయరాజా కోర్టుల వరకు వెళ్లకుండా వాళ్లతో మాట్లాడుకుని ఓకే చేస్తే.. ఆయనకు మరింత గౌరవం పెరుగుతుందని అంటున్నారు సినిమా ప్రేక్షకులు. పెద్ద హీరోల సినిమాల్లో ఆయన మ్యూజిక్ వాడితే ఆయనకే గొప్ప కదా అని సలహా ఇస్తున్నారు.
Read Also : Manchu Lakshmi : మంచు లక్ష్మీపై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫైర్..