టాలీవుడ్ చందమామా కాజల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక డెలివరీ తర్వాత బిడ్డ ది కానీ, కాజల్ ది కానీ ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా డెలివరీ తర్వాత మొట్టమొదటిసారి కాజల్ తన ఫోటోను షేర్ చేసింది. డెలివరీ కి ముందు కొద్దిగా బొద్దుగా కనిపించిన కాజల్.. ఈ ఫొటోలో ఎంతో అందంగా కనిపించింది. స్లీవ్స్ కట్ టాప్ లో మెరిసిన చందమామ ఆ ఫొటోకు పీల్స్ లైక్ సమ్మర్ అని క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ఇక ఈ ఫోటోను చుసిన ఫ్యాన్స్ అరే డెలివరీ తర్వాత కాజల్ లో అందం ఇంకా పెరిగింది అని కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక గతకొద్దిరోజుల నుంచి కాజల్ సినిమాలకు దూరం అవుతుందని వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. ప్రస్తుతం కొడుకు బాధ్యతలను చూసుకుంటున్న కాజల్ రెండేళ్ల వరకు వెండితెరపై కనిపించదని టాక్. ఇక దీంతో కాజల్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే సినిమాలకు దూరమైనా ఇలా సోషల్ మీడియాలోనైనా అభిమానులకు దగ్గరగా ఉంటే చాలు.. సంతోషపడతాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తపై కాజల్ ఒక క్లారిటీ ఇస్తే బావుండు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.