NTR 31: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగుతెరకు పరిచయమైంది కన్నడ నటి జ్యోతిరాయ్. ఈ సీరియల్ లో జగతీ మేడమ్ గా ఆమె నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లకు ఎంత పేరు వచ్చిందో జ్యోతిరాయ్ కూడా అంతే పేరు వచ్చింది. ఇక ఈ సీరియల్ తో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే ప్రెట్టీ గర్ల్ అనే సినిమా తో వస్తున్నట్లు ఆమె అధికారికంగా తెలిపింది. ఇక అందులో ఆమె అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టింది. ఇక ఈ వయసులో ఆమె డైరెక్టర్ సుకు పుర్వాజ్ ను రెండో వివాహం చేసుకుంది. ఎన్ని వివాదాలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం జ్యోతిరాయ్ లక్కీ ఛాన్స్ పట్టేసింది వార్తలు వస్తున్నాయి. దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 31. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ 31. సలార్ సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. దాన్ని పూర్తిచేసి ఎన్టీఆర్ 31 ను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జ్యోతి రాయ్ ఒక కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. జ్యోతిరాయ్ భర్త సుకు, ప్రశాంత్ నీల్ క్లోజ్ ఫ్రెండ్ అని, అతను చెప్పడం వలనే జ్యోతికి ఛాన్స్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజమెంతో తెలియాల్సి ఉంది.