సమ్మర్ చిత్రాలను దెబ్బ కొట్టిందనుకుంటే ఫీవర్ ముగిసినా జూన్‌లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు సౌత్. ఎన్నో అంచనాలతో వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే కుబేరలో తెలుగులో సక్సెసై తమిళంలో ప్లాప్ అయింది. చివరిలో వచ్చిన కన్నప్ప ట్రోలర్లకు సైతం మంచు విష్ణుపై పాజిటివిటీ క్రియేట్ అయ్యేలా చేసింది. జూన్ మాసంలో పెద్దగా ఫెర్మామెన్స్ చూపని దక్షిణాది చిత్ర పరిశ్రమ. జులైలో అనేక చిత్రాలను దించుతోంది. వాటిల్లో ఫస్ట్ వచ్చేస్తున్నాయి నితిన్ తమ్ముడు, సిద్దార్థ్ 3 BHK. వరుస ఫెయిల్యూర్‌లో ఉన్న నితిన్, సిద్దుకు అర్జెంటుగా హిట్ పడాల్సిన నీడ్. సో ఈ ఇద్దరూ చాలా హోప్స్ పెట్టుకున్న మూవీస్. ఇక ఇదే రోజున తమిళంలో సిద్దుకు తోడుగా పరందుపో, ఫోనిక్స్ వస్తున్నాయి.
Also Read : HHVM Trailer : హరిహర.. వీరమల్లు విధ్వంసం మామాలులుగా లేదు
సుమారు టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ క్వీన్ అనుష్క నుండి రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఘాటీ. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన క్రిష్ మూవీ.. జులై 11న రావాల్సి ఉండగా సిజి వర్క్స్ కారణంగా వాయిదా వేశారు. ఆ నెక్ట్స్ వీకే వచ్చేస్తున్నాడు గాలి జనార్థన్ రెడ్డి సన్ కిరీటీ. జూనియర్ అంటూ బైలింగ్వల్ ఫిల్మ్‌తో హీరోగా టెస్ట్ చేసుకోబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ కాగా, జెనీలియా రీఎంట్రీతో పలకరించబోతుంది. ఈ సినిమా కూడా అన్నీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వారాహి బ్యానర్ ఈ మూవీని నిర్మించింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read : Nithiin : ‘తమ్ముడు’కి దూరంగా నితిన్.. కారణం ఇదే.!
ఇక జులై చివరి వారంలో వస్తుంది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐదేళ్ల వెయిటింగ్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. హరి హర వీరమల్లు ఆగమనానికి జులై 24న ముహుర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక థియేటర్లకు మళ్లీ కొత్త కళ సంతరించుకోనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందించిన హరిహర వీరమల్లుపై అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌కు ఎదురెళుతున్నారు పహాద్ ఫజిల్ అండ్ విజయ్ సేతుపతి. తెలుగులో కాకుండా తమిళంలో జులై 25న రెండు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మక్కల్ సెల్వన్, నిత్యా మీనన్ జంటగా తలైవన్- తలైవి, పహాద్- వడివేలు నటిస్తోన్న మారిషన్ జులై 25న థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా అడపాదడపా చిత్రాలున్నాయి. ఇక కేరళ నుండి చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రిలీజ్ కావడం లేదు. జూన్ నెలలో డల్‌గా మారిన బాక్సాఫీసుకు ఊపుతెచ్చే సినిమా ఏది కాబోతుందో చూడాలి.