రాబిన్ హుడ్ తర్వాత నితిన్ నుండి వస్తోన్న మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాతో నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడని మేకర్స్ గట్టిగానే చెబుతున్నారు. కానీ నితిన్ మాత్రం సైలెంట్‌గా స్మైల్ ఇస్తున్నాడు. చెప్పాలంటే పెద్దగా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేయడం లేదు. మరి ప్రమోషన్ల సంగతేంటీ అంటే వాటిని భుజానకెత్తుకున్నారు మేకర్స్‌తో పాటు హీరోయిన్స్.
Also Read : DVV : OG పై అవన్ని పుకార్లే.. ఆయన రావడం పక్కా
సినిమా ఎనౌన్స్ మెంట్ నుండి రిలీజ్ వరకు మేకర్లతో పాటు భుజాన వేసుకుని చేస్తున్నారు హీరోయిన్స్. హాయ్, బై చెప్పామా అని కాకుండా అవసరమైనప్పుడల్లా లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక, సప్తమి గౌడలు తమ్ముడు టీంకి అండగా నిలుస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి ప్రమోషన్లను చేస్తున్నారు. తమ్ముడు ఎనౌన్స్ మెంట్ నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు వరుస ఇంటర్వ్యూలు, ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మరి ఈ ప్రమోషన్లు ఎంత వరకు వర్కౌట్ అయ్యాయి అంటే సినిమాపై గట్టి బజ్ నడిచేలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాయి. తమ్ముడు అటు దర్శకుడికి, ఇటు హీరోకి చాలా కీలకం. అలాంటిది నితిన్ ప్రమోషన్స్ ఏ లెవల్లో చేయాలి.. కానీ కామ్‌గా ఉంటున్నాడు. దీనికి కారణం రాబిన్ హుడ్ డిజాస్టర్. హిట్ కాంబోలో తెరకెక్కిన రాబిన్ హుడ్‌పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు నితిన్. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడ చూసినా నితినే కనిపించాడు. కానీ ఆ సినిమా డిజిస్టార్ తో ఒక్కసారిగా డీలా పడిపోయాడు. ఇప్పుడు ప్రమోషన్లకు దూరంగా ఉండటానికి ఇదే రీజన్. మరి నితిన్ కు తమ్ముడు హిట్ ఇస్తాడో లేదో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.