NTR: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పా కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ” ఒకరోజు కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.. నాన్న.. ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథను వినన్ను.. ఒక్కసారి నువ్వు వింటే బావుంటుంది అని చెప్పినప్పుడు.. ఆరోజు తనొక ఐడియాగా ఈ బింబిసార జ కథ చెప్పడం జరిగింది. ఆరోజు మొదలైన భయం.. అనుభవం లేదు.. కొత్తగా వచ్చాడు దర్శకుడు.. ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉంటుందా లేదా అని ఒక బెరుకు.. కానీ సినిమా చూసాకా.. ఎంత కసిగా అయితే సినిమా కథ చెప్పాడో.. అంతకన్నా గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. అది చిన్న విషయం కాదు.. ఎందుకంటే కథ తెలుసు, కథనం తెలుసు, ఆ కథలో ఏం జరుగుతుందో తెలుసు నాకు.. ఇంత తెలిసిన నాకు ఈ సినిమా చూసినప్పుడు నేను గురైన ఎక్సయిట్మెంట్ ను.. థియేటర్ లో మీరు కూడా ఫీల్ అవుతారు. చాలా చాలా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తను నమ్మిన విధంగా మలచడం చిన్న విషయం కాదు. ఈ సినిమాయే ఇంత అద్భుతంగా మలిచాడు అంటే.. రేపు ఏ పెద్ద సినిమాను అయినా మరింత అద్భుతంగా తీయగలడు. ఈ చిత్రానికి తమ శక్తిని అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడు కు నా థాంక్స్..
ఇక ఈ సినిమాకు ఎన్ని ఉన్నా ఒక వెలితి కనిపించింది.. అదే ఎమ్ఎమ్ కీరవాణి.. ఆయన ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్మ్యూజిక్ ను చూస్తే.. ఈ చిత్రానికి ఆయనే బ్యాక్ బోన్ అని అంటారు.. ఇక ఇదే స్టేజ్ మీద ఒక మాట అన్నాను.. మీకు నచ్చేవరకు సినిమాలు చేస్తూనే ఉంటామని.. మీరు కాలర్ ఎగరవేసే వరకు మేము చేస్తూనే ఉంటామని.. ఇప్పుడు ఈ స్టేజి పై చెప్తున్నాను.. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ ఎక్కువ కాలర్ ను ఎగరేస్తారు. కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసార కు ముందు బింబిసార తరువాత అని అనుకోవడం కాదు ఖచ్చితంగా అనుకుంటారు. మామూలుగానే ఆయన చాలా కష్టపడతారు. ఆ కష్టం నిజంగానే తెరపై కనిపించదు. తమ్ముడిని కాబట్టి ఎక్కువసార్లు ఆయనను కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడతారో అని.. ఈ సినిమాకు నిజంగా కళ్యాణ్ రామ్ తన రక్తాన్ని ధారపోసి.. ఒక నటుడిగా తనను తాను మలుచుకున్నాడు.
కళ్యాణ్ రామ్ లేకపోతే.. బింబిసార ప్లేస్ లో ఎవరిని ఉహించుకోలేం. ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు. థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదంటున్నారు.. ఇవన్నీ నేను నమ్మను. అద్భుతమైన సినిమా వస్తే.. చూసి ఆశీర్వదించే గొప్ప తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరు.. బింబిసార ను ఆదరిస్తారని, అలాగే ఈ సినిమాతో పాటు సీతారామం కూడా వస్తోంది .. ఆ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మాకంటూ ఆస్తులు అక్కర్లేదు.. మీ ప్రేమ ఉంటే చాలు. మా తాత గారు.. నాన్న గారు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి” అంటూ ముగించారు.