NTV Telugu Site icon

Jr NTR: తారకరత్న పోరాడుతున్నారు.. మీడియాతో జూ. ఎన్టీఆర్

Ntr On Tarakaratna

Ntr On Tarakaratna

Jr NTR Responds On TarakaRatna Health Condition: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే! ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానంలో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీసిన తారక్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘తారకరత్న పోరాడుతున్నారు, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు, ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది, తారకరత్న క్రిటికల్ కండీషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేం, కానీ ఆయన త్వరలోనే కోలుకుంటారు’’ అంటూ తారక్ చెప్పుకొచ్చాడు.

Cheating Couple: సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు

తారక్ మాట్లాడుతూ.. ‘‘ఈనెల 27వ తేదీన మా కుటుంబంలో ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. తారకరత్న అన్నకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన కూడా పోరాడుతున్నారు. తాత సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఎంతోమంది అభిమానుల ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఈ పరిస్థతి నుంచి ఆయన త్వరగా కోలుకొని, మునుపటిలాగే మనందరితో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితిలో సహాయం అందిస్తున్న కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్‌కి ధన్యవాదాలు. మరో ఇద్దరు డాక్టర్లను కూడా రప్పించడం జరుగుతోంది’’ అంటూ చెప్పాడు. ఎక్మోలో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని, తనకు వైద్యులు ఇచ్చిన ధైర్యాన్నే అభిమానులకు తెలియజేస్తున్నానని తారక్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తమ్ముడు తారకరత్న త్వరగా కోలుకోవాలని, అందరూ ఆ దేవుడ్ని ప్రార్థించాలని కోరుకుంటున్నానని అన్నాడు.

Volodymyr Zelenskyy: ట్విస్ట్ ఇచ్చిన జెలెన్‌స్కీ.. రష్యాకి ఊహించని దెబ్బ

అంతకుముందు బాలకృష్ణ మాట్లాడుతూ.. తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నామని, స్టంట్ వేయడం కుదరలేదని తెలిపారు. అయితే.. మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని చెప్పారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ సైతం స్పందిస్తూ.. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారన్నారు. కాగా.. తారకరత్నకు మెలెనా వ్యాధి ఉందని, దీని కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. బ్లీడింగ్ వల్ల పలు భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోతుందన్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా తారకరత్నకు బ్లడ్‌పంపింగ్ చేస్తున్నారు.

Fake Baba: విక్రమార్కుడు సీన్ రిపీట్.. నరదిష్టి ఉందని నగలు కాజేశాడు