WAR 2 : అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్-2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ట్రైలర్ అంచనాలను పెంచేసింది. రెడు రోజుల్లో మూవీ థియేటర్లలో వస్తోంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓ కామెంట్ చేశాడు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని. కాలర్ ఎగరేస్తున్నా నన్ను నమ్మండి బొమ్మ అదిరిపోయింది అన్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను సెకండ్ హీరోగా చేశారా లేదంటే విలన్ గా చూపిస్తారా అని.. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ఎన్టీఆర్ ను ఏ మాత్రం తక్కువ చేయలేదు.
Read Also : Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?
మూవీ మొదలైన 20 నిముషాల లోపే ఎన్టీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఉంటుంది. పైగా ఫస్టాఫ్ మొత్తం ఎన్టీఆర్ డామినేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందంట. అందులో ఎన్టీఆర్ యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. సెకండాఫ్ లో కథకు తగ్గట్టు ఇద్దరి పాత్రలు డిజైన్ చేశారు. క్లైమాక్స్ లో ఏ మాత్రం డిసప్పాయింట్ ఉండదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషించేలా క్లైమాక్స్ డిజైన్ చేశాడు అయాన్. ఎమోషన్స్ పలికించడంలో ఎన్టీఆర్ తోపు. అందుకే ఈ మూవీలో బలమైన ఎమోషన్ సీన్స్ లో ఎన్టీఆర్ ను సూపర్ గా ప్రజెంట్ చేశాడంట అయాన్. అందుకే ఈ మూవీ విషయంలో ఎన్టీఆర్ ఫయాన్స్ అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఎన్టీఆర్ చెప్పినట్టే మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Param Sundari Trailer : రజినీకాంత్, బన్నీని ఇమిటేట్ చేసిన జాన్వీకపూర్