JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మిగతా హీరోల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అందరితో కలిసిపోతాడు. తాను సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరైనా సినిమా ఈవెంట్ కు పిలిస్తే కచ్చితంగా వెళ్తుంటాడు. తెలుగులో యావరేజ్ హీరోల సినిమాలకు తరచూ వచ్చి సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోల సినిమాలకు కూడా వచ్చి సాయం అందిస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రీసెంట్ గా కొంత బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడింది. ఎన్టీఆర్ ఈవెంట్ కు వస్తే సినిమా ప్లాప్ అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చిన విశ్వక్ సేన్ మూవీ ప్లాప్ అయింది. అలాగే కల్యాణ్ రామ్ మూవీ కూడా పెద్దగా ఆడలేదు.
Read Also : OG : ఓటీటీలోకి ఓజీ మూవీ.. డేట్, టైమ్ ఫిక్స్..
వార్-2 సొంత సినిమా అయినా ప్లాప్ అయింది. దీంతో ఎన్టీఆర్ పై కొంత నెగెటివిటీ క్రియేట్ చేశారు యాంటీ ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ లో రూ.710 కోట్లు దాటిపోయింది. ఈ సినిమాకు కర్ణాటక కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయంటే ఎన్టీఆర్ హ్యాండ్ అలాంటిది అంటున్నారు అభిమానులు. ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే మామూలు హిట్ అయ్యేది కూడా భారీ హిట్ దిశగా వెళ్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు శింబు సినిమా సామ్రాజ్యంకు కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నారు.
Read Also : Mahesh Babu : 5 వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. గొప్పోనివయ్యా మహేశ్ బాబు..
