Jhansi: ఇప్పడు యాంకర్ అనగానే సుమ గుర్తొస్తుంది. కానీ, సుమ కన్నా ముందు యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. ఒకపక్క యాంకర్ గా ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ఝాన్సీ.. ఈ మధ్యకాలంలో యాంకరింగ్ మానేసి .. పూర్తిగా నటిగా మారిపోయింది. ఇక సలార్ సినిమాలో ఓబులమ్మ పాత్రలో ఝాన్సీ నటించింది అందం కంటే జీవించింది అని చెప్పాలి. రాధారమ పనిమనిషిగా ఆమె నటన అద్భుతం. ఒక్క సినిమాతో ఝాన్సీ లెవెల్ మారిపోయింది.
ఇక ఝాన్సీ సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ప్రముఖ నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుందట. ఆమెకి పితృ వియోగం కలిగింది. గాయత్రీ భార్గవి తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందినట్లు తెలిపింది. గత కొంతకాలంగా సూర్య నారాయణ శర్మ అనారోగ్యంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గాయత్రీ భార్గవి లెజెండ్రీ డైరెక్టర్ బాపు గారి మనవరాలు అనే సంగతి తెలిసిందే. ఝాన్సీకి, గాయత్రీ మంచి స్నేహితురాలు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న ఆమెను ఝాన్సీ ఓదార్చింది. “గాయత్రీ భార్గవి తండ్రి సూర్య నారాయణ శర్మ గారు మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. ఈ సమయంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలి” అని కోరుకుంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.