బాలీవుడ్ జెర్సీ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం కాపీ రైట్స్ ఆరోపణలను ఎదుర్కొంటుంది. జెర్సీ సినిమా కథ నాదే అంటూ రూపేష్ జైస్వాల్ అనే వ్యక్తి కోరుతులో కేసు వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.జెర్సీ కథను నేను ఎంతో ఇష్టంగా రాసుకున్నానని, ఈ స్క్రిఫ్ట్‌ను 2007లోనే ‘ఫిలిం రైటర్ అసోసియేషన్’లో ‘ది వాల్’ పేరుతో రిజిస్టర్ కూడా చేసుకున్నట్లు రూపేష్ తెలిపాడు. అంతేకాకుండా ఈ కథ, కాన్సెఫ్ట్‌ను అక్రమ పద్ధతుల్లో కొంతమంది ప్రతివాదులు సంపాదించి, డబ్బు చేసుకుంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నాడు. నా కథను తెలుగు, హిందీలో ‘జెర్సీ’ పేరుతో నిర్మించి కోట్లు సంపాదిస్తున్నారని, నాకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ వారు మాత్రం సంతోషంగా ఉన్నారని తెలిపాడు.
నా కథలో కొన్ని మార్పులు చేసి గౌతమ్ తిన్ననూరి 2019 లో తెలుగు జెర్సీని, ఇప్పుడు అదే కథను హిందీలో కూడా తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుపుకుంటుంది. ఇకపోతే ఇటీవల్ జెర్సీ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కెజిఎఫ్ 2, బీస్ట్ చిత్రాల మధ్యలో ఈ సినిమాను రిలీజ్ చేయడం వలన తమ మార్కెట్ దెబ్బ తింటుందని భావించి జెర్సీ సినిమాను వాయిదా వేశారని అందరు అనుకుంటుండగా.. ఈ వివాదం బయటకు రావడం సెన్సేషనల్ గా మారింది. దీంతో ఈ కారణంగానే జెర్సీ విడుదల వాయిదా వేశారని పలువురు నొక్కివక్కాణిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ లోపు ఈ వివాదం సద్దుమణుగుతుందా..? లేక మరోసారి ఈ సినిమా వాయిదా పడుతుందా..? అనేది చూడాలి.