JD Chakravarthy: ‘అంతం కాదిది ఆరంభం’ పోస్టర్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Movie Poster: ఇషాన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ నిర్మిస్తున్న సినిమా ‘అంతం కాదిది ఆరంభం’. ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ని టాలెంటెడ్ యాక్టర్ జె. డి. చక్రవర్తి ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “టైటిల్ చూడగానే.. అరే ఇంత మంచి టైటిల్‌ని ఇప్పటి వరకు అంతా మిస్ అయ్యారేంటి? అని అనిపించింది. అందుకే నిర్మాత సిరాజ్‌ని టైటిల్ రిజిస్టర్ చేయించారా? అని అడిగాను. ఒకవేళ చేయించకపోతే నేను కొట్టేసేవాడిని. కథలు కొట్టేయడం కామన్.. ఇవాళ సరైన టైటిల్ దొరకడం లేదు. ‘అంతం కాదిది ఆరంభం’ అనేది పాజిటివ్ అండ్ అద్భుతమైన టైటిల్. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ కృష్ణ గారు సినిమా చేశారు. విజయనిర్మలగారు ఆ సినిమాకి డైరెక్టర్. హైదరాబాద్ సుదర్శన్ 70MMలో రిలీజైంది. నేనప్పుడు ఆ థియేటర్‌లో సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అలాగే.. అన్నం అంతా చూడక్కరలేదు.. అనే సామెతలా ఈ టైటిల్ చూస్తుంటే ఇది మంచి సినిమా అని ఖచ్చితంగా నమ్మవచ్చు. న్యూ టీమ్ అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేసిన జె. డి. చక్రవర్తికి దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ఇషాన్, ప్రణాళి, రాకెట్ రాఘవ, ప్రవీణ్, కరాటే కళ్యాణి, గీతాసింగ్, నాగ మహేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంభాషణలు రాజేంద్ర, భరద్వాజ్ సమకూర్చగా, వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందించారు.
Also Read
తాజావార్తలు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!