ప్రముఖ మలయాళ నటుడు జయసూర్య నటించిన వందవ చిత్రం ‘సన్నీ’. జీవితంలో అన్నీ కోల్పోయిన సన్నీ అనే మ్యూజిషియన్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో ప్రేమను, డబ్బును, స్నేహితుడిని కోల్పోయి దుబాయ్ నుండి కరోనా సమయంలో కేరళకు తిరిగి వచ్చిన మ్యూజీషియన్ జీవితంలోకి అపరిచితులైన కొద్దిమంది ప్రవేశం కారణంగా ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమాను రంజిత్ సర్కార్ తో కలిసి జయసూర్య తన డ్రీమ్ ఎన్ బియాండ్ బ్యానర్ లో నిర్మించాడు.
Read Also : బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ
సర్కార్ ఈ సినిమాకు కథను ఇవ్వడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఈ నెల 23న స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ చిత్రంలోని భావోద్వేగాలు వ్యూవర్స్ కు ఖచ్చితంగా నచ్చుతాయనే ఆశాభావాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇండియా డైరెక్టర్ కమ్ కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రహ్మణన్ తెలిపారు. గత యేడాది జయసూర్య నటించిన ‘సూఫియుమ్ సుజాతయుమ్’ చిత్రం సైతం అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.