ప్రముఖ మలయాళ నటుడు జయసూర్య నటించిన వందవ చిత్రం ‘సన్నీ’. జీవితంలో అన్నీ కోల్పోయిన సన్నీ అనే మ్యూజిషియన్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో ప్రేమను, డబ్బును, స్నేహితుడిని కోల్పోయి దుబాయ్ నుండి కరోనా సమయంలో కేరళకు తిరిగి వచ్చిన మ్యూజీషియన్ జీవితంలోకి అపరిచితులైన కొద్దిమంది ప్రవేశం కారణంగా ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమాను రంజిత్ సర్కార్ తో కలిసి జయసూర్య తన డ్రీమ్ ఎన్ బియాండ్ బ్యానర్ లో నిర్మించాడు.…