కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా చరిత్రని తిరగరాయడం కాదు కొత్త చరిత్రని రాస్తోంది. డే 1 కన్నా డే 4 జవాన్ కలెక్షన్స్ ఎక్కువ అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న షారుఖ్ మండే టెస్ట్ ని కూడా సూపర్ సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యాడు. ఫస్ట్ మండే జవాన్ సినిమా 30 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసింది. దీంతో ఓవరాల్ గా జవాన్ సినిమా కలెక్షన్స్ 575 కోట్లకి చేరింది. అయిదు రోజుల్లో 500 కోట్లు రాబట్టిన ఏకైక బాలీవుడ్ సినిమాగా జవాన్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ వీకెండ్ తో ఫాస్టెస్ట్ 1000 క్రోర్ గ్రాసర్ గా జవాన్ సినిమా కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయనుంది. నార్త్ అండ్ ఓవర్సీస్ లోనే కాదు సౌత్ లో కూడా జవాన్ సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది.
ముఖ్యంగా తమిళ్ అండ్ తెలుగులో జవాన్ సినిమా 35 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. ఒక హిందీ సినిమా సౌత్ లో 35 కోట్ల మార్క్ దాటడం ఇదే మొదటిసారి. అట్లీ సౌత్ డైరెక్టర్ అవ్వడం, అనిరుద్ మ్యూజిక్ కి తెలుగులో ఉన్న క్రేజ్ కలవడంతో జవాన్ సినిమా సెన్సేషన్ బుకింగ్స్ ని సౌత్ లో కూడా రాబడుతోంది. సెప్టెంబర్ 15న కూడా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు కాబట్టి జవాన్ సినిమా మరో వారం పాటు సౌత్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ఓవరాల్ గా జవాన్ సినిమా తెలుగు, తమిళ్ లో 50 కోట్లు రాబడితే జైలర్, బహుబలి 2, KGF 2 సినిమాల తర్వాత అన్ని ఇండస్ట్రీల్లో 50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ సినిమాగా జవాన్ నిలుస్తుంది. ఇదే జరిగితే ఈ రికార్డుని బ్రేక్ చేయడం ఇప్పట్లో ఏ బాలీవుడ్ హీరోకీ అయ్యే పని కాదు.