Jatin Singh Jamwal Makes Shocking Comments On Casting Couch: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా ఎదురవుతుంటాయి. ఇందుకు జతిన్ సింగ్ జమ్వాల్‌కి ఎదరైన చేదు అనుభవమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆఫర్ కోసం వెళ్లిన అతని పట్ల ఓ దర్శకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. పబ్లిక్ ప్లేస్‌లోనే ఆ నటుడి తొడలపై చేతులు వేశాడు. ఆ దెబ్బకు జతిన్ భయపడి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Salman Khan : మమతా బెనర్జీని కలిసిన సల్మాన్ ఖాన్
జతిన్ మాట్లాడుతూ.. ‘‘ఆయన ఒక పెద్ద దర్శకుడు. ఓటీటీ షోల కోసం నటీనటులను ఎంపిక చేసే ఆయన్ను.. ఒక్క ఛాన్స్ ఇవ్వమని నేను అడిగాను. ఆయన వాట్సాప్‌లో సెల్పీ దిగి పంపమని చెప్పగా.. నేనలాగే చేశాను. నా ఫోటో చూశాక.. బాగున్నావ్, సాయంత్రం కాఫీ షాప్‌లో కలుద్దామన్నాడు. ఆయన పిలిచినట్లుగా కాఫీ షాప్‌కి వెళ్లాను. అక్కడ ఆయన మామూలుగా మాట్లాడుతూ.. సడెన్‌గా నా కాళ్లపై చేతులు వేశాడు. దాంతో నేను ఖంగుతిన్నాను. నాకు ఇలాంటివన్నీ నచ్చవని చెప్పినా.. ఇక్కడ ఇలాంటివన్నీ మామూలే అంటూ చెయ్యి తీయలేదు. అప్పుడు నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. ఆ షాక్ నుంచి చాలాకాలం వరకు నేను తేరుకోలేదు. చాలాసార్లు ఆ ఘటనని తలచుకొని, వెక్కి వెక్కి ఏడ్చాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన అడిగినదానికి ఒప్పుకోకపోవడం వల్ల తనకు ఒక ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం చేజారిందన్నాడు.
Bharat Jodo Yatra: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్.. రాహుల్ పర్యటించిన మెజారిటీ స్థానాల్లో విజయం
అలాగే.. మరో దర్శకుడితో ఎదురైన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి కూడా జతిన్ వెల్లడించాడు. ‘‘ఒక ఆఫర్ ఉందని తెలిసి, నేను ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన నన్ను ఒంటి మీద బట్టలు లేకుండా, కేవలం అండర్‌వేర్‌తో ఫోటో దిగి పంపించమన్నాడు. ఆయన ఆ మాట చెప్పగానే నేను షాకయ్యాను. ఆయనలా చేశాడని నేను నా స్నేహితులకు, మిగతావాళ్లకు చెప్పడంతో.. అతడు నాకు మెసేజ్ చేయడం ఆపేశాడు. ఇండస్ట్రీలో ఇలాంటివి అడుగడుగునా ఉంటాయని నాకు అప్పుడే తెలిసొచ్చింది. కానీ.. ఇలాంటి సంఘటనలు మానసికంగా కుంగదీస్తాయి’’ అని జతిన్ సింగ్ పేర్కొన్నాడు.