Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి.. తన అందాన్ని మొత్తం కూతుర్లకు ఇచ్చేసి.. ఆమె వెళ్ళిపోయింది. ఇక తల్లి అందాన్ని పుణికిపుచ్చుకున్న కూతుర్లు ఎప్పటికప్పుడు ఆమెను గుర్తుచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఈ చిన్నదాన్ని హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడింది. కానీ, ఆ ముచ్చట తీరకుండానే శ్రీదేవి మృతి చెందింది.